Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లయన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్
తెలుగు చిత్రపశ్రమలోని ఉత్తమ ప్రతిభను కనబరిచిన టీవీ సీరియల్స్ మరియు సౌత్ ఇండియాలో మంచి పేరు తెచ్చుకున్న చిత్రాలకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నంది అవార్డులు అందజేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా భాగస్వామ్యం చేసేందుకుగాను ఇటీవల తెలంగాణ రాష్ట్ర టూరిజం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను టీఎఫ్‌సీసీ సభ్యులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా|| ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. తెలుగు చిత్రపరిశ్రమ లోని ఉత్తమ ప్రతిభను కనబరిచిన టీవీ సీరియల్స్‌కు, సౌత్ ఇండియాలో మంచి పేరు తెచ్చుకున్న చిత్రా లకు నంది అవార్డులు అందజేయాలని టూరిజం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గారిని కలవడం జరిగిందన్నారు.