Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ
గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీర సింహారెడ్డి'. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి టీజర్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. అలాగే ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా ఆలరించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో వీరసింహారెడ్డి చిత్ర యూనిట్ లో ఒంగోలులో మాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించింది. భారీగా తరలివచ్చిన అభిమానులు సమక్షంలో 'వీరసింహారెడ్డి' ప్రీరిలీజ్ వేడుక కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ దర్శకుడు బి గోపాల్ చేతుల మీదగా విడుదలైన 'వీరసింహారెడ్డి' ట్రైలర్ ప్రేక్షకులు, అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. ప్రీరిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడి స్వరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నా తండ్రి, నా గురువు, దైవం, ఆ కారణజన్ముడికి శత జయంతి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కుటుంబ సభ్యుడు దర్శకుడు బి గోపాల్ గారికి కతజ్ఞతలు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహనాయడు ఇలా చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు అందించారని అన్నారు. ఈ వేడుకకు బి గోపాల్ గారు ఒక పెద్దరికాన్ని తీసుకొచ్చారని తెలిపారు.. ఇన్ని కోట్ల మంది అభిమానులని పొందానంటే అది జన్మజన్మల అనుబంధం అనిపిస్తుందని చెప్పారు.
శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. మైత్రీ మూవీ మేకర్స్ కి బిగ్ థాంక్స్. వారితో ఇది నాకు మూడో సినిమా. వీరసింహారెడ్డికి పని చేసినం నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ కతజ్ఞతలు. దర్శకుడు గోపీచంద్ గారితో ఇది నా మూడో సినిమా. పరిశ్రమలకో నాకు అన్నయ లాంటి వ్యక్తితను. తనతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని వుంది. బాలకష్ణ గారితో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. బాలయ్య గారు రియల్ సింహం విత్ గోల్డెన్ హార్ట్. జై బాలయ్య'' అన్నారు.