Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి కళ్యాణ్ రామ్ నటనలో మరో కొత్త కోణాన్ని ఎలివేట్ చేస్తోన్న 'అమిగోస్'.... సినిమాపై అంచనాలను పెంచేసిన టీజర్
నాతోనే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడతార్రా? అని సీరియస్‌గా అంటున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. అసలు ఆయనతో ఇంతకీ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడింది ఎవరు? అని అనుకుంటే అది మరో ఇద్దరు నందమూరి కళ్యాణ్ రామ్‌లు. అయ్యో! ఇదేంటి కళ్యాణ్ రామ్‌తో ఆయనే మరో ఇద్దరు వ్యక్తులుగా మారి గేమ్ ఆడుతున్నారని తెగ ఆలోచిస్తున్నారా? ఇదొక ఫజిల్‌లాగా అనిపిస్తుందా? అయితే ఈ ఫజిల్‌కు సొల్యూషన్ దొరకాలంటే మాత్రం 'అమిగోస్' సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
వైవిధ్యమైన సినిమాలు, పాత్రలు చేయటానికి ఆసక్తి చూపించి హీరోస్లో ముందు వరుసలో ఉండే స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన చేస్తున్న సినిమాలే అందుకు ఎగ్జాంపుల్స్‌గా చెప్పుకోవచ్చు. గత ఏడాది బింబిసార వంటి డిఫరెంట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు అమిగోస్ అంటూ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. 'అమిగోస్'.... ఈ టైటిల్ ఏంటి కొత్తగా ఉందని అనిపిస్తుంది. టైటిలే కాదు.. కాన్సెప్ట్ కూడా టాలీవుడ్ ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుందని అంటున్నారు దర్శకుడు రాజేంద్ర రెడ్డి.
కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి ఎప్పుడూ ముందుండే కళ్యాణ్ రామ్ మరోసారి రాజేంద్ర రెడ్డి అనే డెబ్యూ డైరెక్టర్‌తో కలిసి చేసిన చిత్రమే 'అమిగోస్'. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 10న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవల్లో విడుదలవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఆదివారం (జనవరి 8) రోజున 'అమిగోస్' టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరాయి.
ఇప్పటి వరకు తాను చేసిన పాత్రలకు భిన్నంగా 'అమిగోస్' చిత్రంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశారు. ఎంటర్‌ప్రెన్యూరర్‌గా, సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా, క్లిలర్గా ... ఓ కళ్యాణ్ రామ్ పాత్రను మరో కళ్యాణ్ రామ్ చంపాలనుకోవటం.. దాని చుట్టూ జరిగే ఆసక్తికరమైన కథ.. మూడు పాత్రలు ఒక చోట కలుసుకోవటం.. అసలు ఒకేలా ఉన్న ఆ ముగ్గురు ఎవరు? అన్నదమ్ములా.. స్నేహితులా .. అసలు ఒకరినొకరు ఎందుకు చంపుకోవాలనుకుంటున్నారు? ఇలాంటి ఎగ్జయిటింగ్ ప్రశ్నలెన్నో టీజర్ చూస్తుంటే మనసులో క్రియేట్ అయ్యాయి. ఈ ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచేలా మేకర్స్ త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. అయితే సమాధానం దొరకాలంటే మాత్రం ఫిబ్రవరి 10 వరకు ఆగాల్సిందే.
కళ్యాణ్ సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్.సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా.. తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.