Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాలను రూపొందించే ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తోన్న అద్భుతమైన పౌరాణిక దృశ్య కావ్యం శాకుంతలం'. ఇండియన్ సినీ ప్రేక్షకులు 2023లో చూడాలనుకుని ఆసక్తిగా ఎదురు చూస్తోన్న విజువల్ వండర్‌గా శాకుంతలం తనదైన ప్రత్యేకతను సంపాదించుకుంది. అందాల సుందరి సమంత ఇందులో టైటిల్ పాత్రలో నటించారు. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రాని విధంగా ఈ పౌరాణిక ప్రేమ గాథను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా గుణశేఖర్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో... సమంత మాట్లాడుతూ ''ఈ క్షణం కోసమే నేను, మా శాకుంతలం టీమ్ ఎదురు చూస్తున్నాం. ఎలాగైనా ఇక్కడకు రావాలని ఫిక్స్ అయిపోయి బలం తెచ్చుకుని వచ్చాను. గుణ శేఖర్‌గారిపై ఉన్న రెస్పెక్ట్, అభిమానం వల్ల వచ్చాను. ఆయనకు సినిమానే జీవితం. ప్రతి సినిమాను ప్రాణం పెట్టి తీస్తారు. ఈ సినిమాను కూడా అలాగే తీశారు. నెరేషన్ విన్నప్పుడూ యాక్టర్స్ అందరూ సినిమా అలాగే రావాలని కోరుకుంటారు. కొన్నిసార్లు మాత్రమే మా ఊహను దాటి ఎక్స్ట్రా మ్యాజిక్ జరుగుతుంది. సినిమా చూసిన తర్వాత నేను చూసిన తర్వాత నేను అదే ఫీల్ అయ్యాను. నేను ఊహించిన దాని కంటే సినిమా ఎన్నో రెట్లు బావుంది.. అని సమంత అన్నారు. నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. అయితే మారనది ఒకటే ఉంది. అదే సినిమాను నేను ఎంత ప్రేమిస్తాను.. సినిమా నన్ను ఎంత ప్రేమిస్తుందనే విషయం. శాకుంతలంతో ఈ ప్రేమ మరింత పెరుగుతుందని నమ్ముతున్నాను'' అన్నారు.