Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాబోతుంది : రవితేజ మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య' అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌తో పాటు.. ఇద్దరూ కలసి అలరించిన పూనకాలు లోడింగ్ పాటకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన అల్బమ్‌లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి... వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇక తాజాగా విడుదలైన వాల్తేరు వీరయ్య ట్రైలర్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వాల్తేరు వీరయ్య' జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ వైజాగ్ లో మెగామాస్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మాసీవ్ గా నిర్వహించింది. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానుల సమక్షంలో మాస్ జాతరలా జరిగిన మెగామాస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. బాబీ వాల్తేరు వీరయ్య అనే టైటిల్ తో కథ చెప్పినపుడు వినగానే అద్భుతం అనిపించింది. షేక్ హ్యాండ్ ఇచ్చి 'ఈ సినిమా తప్పకుండా చేస్తున్నాం'' అని అప్పుడే చెప్పాను. ఫస్ట్ హియరింగ్ లోనే చాలా బావుంది అనుకునే కథలు నా కెరీర్ లో సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఆ నమ్మకంతో చెబుతున్నాను.. వాల్తేరు వీరయ్య చాలా బాగా ఆడుతుంది అన్నారు. ప్రతి ఒక్కరిని అలరించే సినిమా వాల్తేరు వీరయ్య. బాబీలో కథకుడు, రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్ కనిపిస్తారు. ఆ తర్వాతే తనలో అభిమానిని చూస్తాను. అభిమాని అని సినిమా ఇవ్వలేదు. అతని ప్రతిభ అద్భుతమనే ఈ సినిమాని ఇచ్చాను. నా నమ్మకాన్ని నిలబెట్టుకు ంటూ అనుకున్నదాని కంటే గొప్పగా సినిమాని తీశాడు. ఒక కమర్షియల్ సినిమాలో ఏ ఎలిమెంట్స్ కావాలో అన్నీ చక్కగా పొందుపరిచాడు అన్నారు. మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య నటీనటులకు, సాంకేతిక నిపుణలందరికీ కంగ్రాట్స్. ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్. పూనకాలు లోడింగ్. చిరంజీవి గారితో నా జర్నీ మొదలైయింది విజయవాడ నుంచి. విజేత వేడుక విజయవాడలో జరిగినప్పుడు .. చిరంజీవి గారిని చాలా దూరం నుంచి చూశాను. అప్పుడే మా ఫ్రండ్స్ తో ఏదో ఒక రోజు .. ఆయన పక్కన కూర్చుంటానని చెప్పాను. అక్కడ నుండి మొదలైతే మొదట ఫ్రండ్ క్యారెక్టర్, తర్వాత తమ్ముడి క్యారెక్టర్.. ఇప్పుడు వాల్తేరు వీరయ్య. చిరంజీవి గారితో వున్న ప్రతి మూమెంట్ చాలా గర్వంగా వుంటుంది. సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం'' అన్నారు.