Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనిక సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ నటిస్తున్న 'బుట్ట బొమ్మ' చిత్రం నుంచి మొదటి పాట 'పేరు లేని ఊరులోకి' విడుదలైంది. స్వీకర్ అగస్తి స్వరపరిచిన ఈ పాటను సనాపతి భరద్వాజ్ పాత్రుడు రచించగా, మోహన భోగరాజు ఆలపించారు.
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా 'బుట్ట బొమ్మ'. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మోహన భోగరాజు ఆలపించిన 'పేరు లేని ఊరులోకి' అనే మొదటి పాట ఈరోజు విడుదలైంది.
పాటలోని ప్రశాంతమైన పరిసరాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అవి మనల్ని పాత్రల యొక్క చిన్న ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నాయి. 'అంకె మారి లంకె వేసే కొత్త సంఖ్య వచ్చిందా..
నవ్వులన్నీ మూటగట్టి మోసుకొస్తూ ఉందా', 'అలుపు సలుపు అణువంత కూడా తల దాచుకోని చురుకంతా.. తన వెంటపడుతూ నిమిషాలు మెల్లగా కరిగే ప్రతి పూట' అంటూ సనాపతి భరద్వాజ్ పాత్రుడు అందించిన సాహిత్యం పాట సందర్భానికి తగ్గట్టుగా అర్థవంతంగా, ఆకట్టుకునేలా ఉంది. గీత రచయిత ఏమంటున్నారంటే...
ఈ పాట రాయడానికి ప్రధాన ప్రేరణ, దర్శకులు రమేష్ గారు నన్ను నాకంటే ఎక్కువ నమ్మడమే. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆయనకు నా ధ్యన్యవాదాలు.
స్వీకర్ అగస్తి గారి ట్యూన్స్ చాలా సహజంగా, క్యాచీగా ఉంటాయి అన్నారు. స్వీకర్ అగస్తీ అందించిన ఆకర్షణీయమైన సంగీతం, మోహన భోగరాజు అద్భుతమైన స్వరం కలిసి పాటను ఎంతో అందంగా మలిచాయి.