Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోహెడ
మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆవరణలో కరీంనగర్ మిల్క్ ప్రోడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో మంజూరైన డైరీ లోన్లను రైతులకు మంగళవారం ఫ్యాక్స్ ఛైర్మన్ దెవేందర్రావు చేతులమీదుగా లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 మంది రైతులకు 10 లక్షల ఎనభై వేల రూపాయలను అందజేసినట్లు తెలిపారు. మండలంలో రైతులు డైరీ లోన్స్, షిప్ లోన్స్, మార్టిగేజె లోన్స్ అవసరమైనట్లయితే కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం సీఈవో ముంజ మల్లికార్జున్, డైరెక్టర్ బానోతు బాలు, మిల్క్ డైరీ అధ్యక్షుడు లావుడ్య లకపతి, రైతులు లావుడ్య దేవేందర్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.