Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ లక్ష్మి గణ సుబ్రమణ్య స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై నూతన నటుడు జి.ఎస్.ఎన్ నాయుడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'యుగల్' (ది మాన్ విత్ డైవర్సన్ అనేది ట్యాగ్ లైన్). ప్రమోద్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో ఆర్ బాలాజీ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మొదటి ప్రచార చిత్రాన్ని పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో జిఎస్ఎన్నాయుడు మాట్లాడుతూ, 'ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నాం. హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి' అని తెలిపారు. 'మా చిత్ర హీరో జి ఎస్ ఎన్ నాయుడు మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. అందుకే మా చిత్రాన్ని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నాం. ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకి విపరీతంగా నచ్చుతుంది. కథ, స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుగు తోంది. మా నిర్మాతలు ఎక్కడా రాజీపడటం లేదు' అని కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్న ప్రమోద్ కుమార్ అన్నారు. ఈ చిత్రానికి మాటలు : ప్రమోద్ కుమార్, రాహుల్ జి గౌలికర్, ఎడిటర్ : అలోషియస్ జేవియర్, కెమెరా మాన్ : ప్రేమ్ జై విన్సన్ట్, సంగీత దర్శకుడు : సన్నీ మాణిక్, నిర్మాత : ఆర్.బాలాజీ.