Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి ఏటా సంక్రాంతి పండగ కోసం రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. రెడ్ సెడార్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ పండగ వాతావరణం ఉట్టి పడేలా 'సంక్రాంతి తకదై' పాటను సోషల్ మీడియా ద్వారా గ్రాండ్‌గా విడుదల చేశారు.
శరద్ గుమస్తే నిర్మించిన ఈ పాటలో మానస్ నాగులపల్లి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్, నిఖిల్ నర్తించారు. అంతేకాకుండా ఈ పాటలో కన్నడ సూపర్ స్టార్ రమేష్ అరవింద్ స్పెషల్ అప్పీరెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
'తకదై.. తకదై తకదై...తకదై తకదై తకదై తకదై దూరమున్న నింగిలో తార నేలకు జారిందా..' అంటూ ఈ పాటను అవినాష్ రావి నూతల రాయగా, అనీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో అనూప్ మీనన్ అద్బుతంగా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటను అనూప్ మీనన్, లక్ష్మి హేసల్ అద్భుతంగా ఆలపించారు. జై సరికొండ అందించిన ఈ పాటలో గంగిరెద్దు, ముగ్గులు, పచ్చని పొలాలు వంటి కెమెరా విజువల్స్ చూస్తుంటే ప్రేక్షకులకు సంక్రాంతి ముందే వచ్చిన ఫ్రెష్ ఫీల్‌ని కలిగిస్తుంది. యూట్యూబ్‌లో విడుదలైన కొన్ని గంటలలోనే ఈ పాటకు సంగీత ప్రియుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో మేకర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.