Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈసారి భారతీయ సినిమా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులను అందుకునేందుకు పలు భారతీయ సినిమాలు ఆస్కార్
బరిలో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 10 సినిమాలు ఆస్కార్ కోసం పోటీ పడుతున్నాయి. వీటిల్లో తెలుగు సినిమా 'ఆర్ఆర్ఆర్' ఇప్పటికే రెండు విభాగాల్లో అర్హత సాధించడం విశేషం.
95వ ఆస్కార్ అవార్డుల కోసం మన దేశం నుంచి అధికారికంగా 'ది ఛల్లో షో'ని పంపారు. దీంతోపాటు 'ఆర్ఆర్ఆర్', 'ది కాశ్మీర్ ఫైల్స్', 'కాంతార', 'విక్రాంత్ రోణ', 'గంగూభాయి కతియావాడి', 'మి వసంతరావ్', 'తుజ్యా సాథీ కహీ హై', 'రాకెట్రీ', 'ఇరవిన్ నిళన్' చిత్రాలు ఓపెన్ కేటగిరిలో నిలిచాయి. వీటితోపాటు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 301 సినిమాలు ఆస్కార్ పురస్కారాల కోసం పోటీ పడుతున్నాయి. 95వ ఆస్కార్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన చిత్రాలను ఈనెల 24న ప్రకటిస్తారు. మార్చి 12న ఆస్కార్ వేడుకలు జరుగనున్నాయి. 'ఆర్ఆర్ఆర్' సినిమాతోపాటు రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన 'కాంతార' సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు అర్హత సాధించడం మరో విశేషం.