Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో అడివి శేష్ నటించిన చిత్రం 'గూఢచారి'. దీనికి సీక్వెల్‌గా 'జీ2' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అడవి శేష్ కథ అందించారు. 'మేజర్' ఎడిటర్ వినరు కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు.
మంగళవారం నిర్వహించిన ఈ చిత్ర ప్రెస్మీట్లో 'ప్రీ విజన్'ని మేకర్స్ లాంచ్ చేశారు.
అడివి శేష్ మాట్లాడుతూ,''జీ2'ని ఒక ఫ్రాంచైజ్‌గా ప్రపంచవ్యాప్తంగా తీసు కెళ్లాలనే తపన వుంది. కొత్త దర్శకుడు వినరుకి చాలా గ్రేట్ విజన్ ఉంది. తనకి గూఢచారి వరల్డ్ పై చాలా మంచి పట్టు ఉంది. మా నిర్మాతలు విశ్వప్రసాద్, అనిల్, అభిషేక్‌కి కతజ్ఞతలు. 'గూఢచారి' సౌత్ ఇండియా స్పై సినిమాల ట్రెండ్‌ని మళ్ళీ తీసుకొచ్చింది. 'జీ2'తో ఆల్ ఇండియా ఫ్రాంచైజ్‌గా మారబోతుంది. ఇది నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఈ చిత్రాన్ని ఐదు దేశాల్లో షూట్ చేయబోతున్నాం. 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది' అని తెలిపారు.
'ఈ సినిమా ప్రేక్షకుకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. ప్రీ విజన్‌కి శ్రీచరణ్ చాలా చక్కని సంగీతం అందించారు. సినిమా అంచనాలకు మించి ఉంటుంది' అని దర్శకుడు వినరు కుమార్ అన్నారు. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ,'నిర్మాణంలోకి వచ్చిన కొత్తలో 'గూఢచారి' చేశాం. కొత్త కంటెంట్‌ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకాన్ని ఇచ్చిన చిత్రమిది. ఇప్పుడు మా నిర్మాణంలో దాదాపు 20 చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమా మాకు ఎంతో ప్రత్యేకం. పాన్ ఇండియాగా లాంచ్ చేసి, పాన్ వరల్డ్ సినిమా స్థాయికి తీసుకువెళ్లాని భావిస్తున్నాం' అని చెప్పారు. మరో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, 'ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు అందుకునే భాద్యతని శేష్, మేము తీసుకున్నాం. ఈ సినిమా అద్భుతంగా ఉండబోతుంది' అని అన్నారు.