Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళి కిషోర్ దర్శకుడు. బన్నీ వాసు నిర్మాత. ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, 'గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయడం వేరు, వినరో భాగ్యము విష్ణు కథ సినిమా కథ చేయడం వేరు. ఇలా ఎందుకు చెప్తున్నానో మీకు ఫిబ్రవరి 17న తెలుస్తుంది. ఈ సినిమాలోని డైలాగ్స్ అలా గుర్తుండిపోతాయి. సినిమా చాలా ఇంపాక్ట్ ఫుల్‌గా ఉంటుంది' అని తెలిపారు. 'ఇందులో విష్ణు తత్త్వం ఉంది. ఒక మనిషి చిరునవ్వుని, అవతలవాడికి సాయం పడే విధానాన్ని కమర్షియల్‌గా చెప్పాం. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్‌కు ఇండిస్టీ పెద్దలనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది' అని నిర్మాత బన్నీవాసు చెప్పారు.