Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఒకప్పుడు జాతీయ స్థాయిలో సినిమా అంటే బాలీవుడ్ అనేవారు. సహజత్వం, ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్‌గా మలయాళం, కన్నడ, బెంగాలీ సినిమాలు చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు జాతీయంగానే కాదు అంతర్జా తీయంగా కూడా తెలుగు సినిమా కేంద్ర బిందువుగా నిలిచింది. మధ్యలో కొన్ని ఒడిదుడుకులకు లోనైనప్పటికీ తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ కొనసాగింపులో నేనూ భాగమవ్వడం చాలా ఆనందంగా ఉంది' అని చిరంజీవి చెప్పారు. చిరంజీవి, రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో
నిర్మించారు. ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి మీడియాతో షేర్ చేసుకున్న పలు విశేషాల సమాహారం..
ప్రేక్షకులు, అభిమానులు నా నుండి ఏం కోరుకుంటున్నారో అది వందకి వందశాతం ఇవ్వాలనే ప్రయత్నంతో ఈ సినిమా చేశాను. ఇది కచ్చితంగా అందర్నీ అలరిస్తుంది. మరోసారి వింటేజ్ చిరంజీవిని గుర్తు చేస్తుంది. 'ముఠామేస్త్రీ, ఘరానామొగుడు, రౌడీ అల్లుడు' లాంటి చిత్రాలను రీ కలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చిందీ సినిమా. దర్శకుడు బాబీ తను నా అభిమానిగా నన్ను ఎలా చూపించాలనుకున్నాడో, అలాగే ప్రేక్షకులకు, నా అభిమానులకు ఏం కావాలనుకున్నాడో వాటిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. ఈ సినిమాలో రవితేజ పాత్ర కథకు మరింత బలం చేకూరుస్తుంది. తన పాత్రలో చాలా ఎమోషన్ ఉంటుంది.
అలాగే ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే, ఒక ముఠామేస్త్రీ, ఘరానామొగుడు, అన్నయ్యలో ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ రైజేషన్తో పోల్చుకోవచ్చు. ఫ్యామిలీ, పిల్లలతో వెళ్తే చాలా ఎంజారు చేస్తారు. ఈ సినిమాలో తొలిసారి శృతిహాసన్ నా సరసన నటించింది. ఆమె చక్కటి డాన్సర్. దేవిశ్రీ ఈ సినిమా మ్యూజిక్ కోసం మనసు పెట్టి చేశాడు. జాతీయ అవార్డ్ పొందిన నటుడు బాబీ సింహా ఈ సినిమాలో అద్భుతంగా చేశాడు.
మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు. ఈ సంస్థ నుండి ఒకేసారి 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' సినిమాలు వస్తున్నాయనేేసరికి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. పండగ ఎన్ని సినిమాలైనా తీసుకుంటుంది. ఒక రోజు గ్యాప్ ఇస్తే గనుక ఏ సినిమా రెవెన్యూ ఆ సినిమాకి ఉంటుంది. అందుకే నేనే వెనుకకు జరుగుతానని చెప్పాను.
టికెట్ రేటుని రూ. 25 పెంచుకునే వెసులుబాటు ఏపీ ప్రభుత్వం కల్పించింది. అలాగే ఆరు షోలు వేసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించినందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ధన్యవాదాలు.
జీవితాంతం సినిమాతో మమేకం అవ్వాలనే ఉంది. ఈ విషయంలో హాలీవుడ్ స్టార్, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ నాకు స్ఫూర్తి. సందర్భం, అవకాశం లభిస్తే కచ్చితంగా దర్శకత్వం వహిస్తా.
'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని
'నాటు నాటు'
పాటకు ప్రతిష్టాత్మక
గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం ఆనందంగా ఉంది. చిత్ర టీమ్‌కు నా అభినందనలు. ఇదొక చారిత్రక విజయం. దేశం గర్వించే విజయమిది.
- చిరంజీవి