Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సినీ చరిత్రలో ఎవరూ ఇంతవరకు చేయనటువంటి దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల చరిత్రను ఆధారంగా చేసుకుని అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం 'దేశం కోసం భగత్ సింగ్'. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది.
గతంలో 'అన్నల రాజ్యం, నాగమనాయుడు, రాఘవేంద్ర మహత్యం' లాంటి చిత్రాలను నిర్మించిన నాగలక్ష్మి ప్రొడక్షన్స్ అధినేత రవీంద్ర గోపాల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రవీంద్రజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, నిర్మించారు. దేశ భక్తి నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రంలో రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రల్లో, సూర్య, జీవా, ప్రసాద్ బాబు, అశోక్ కుమార్, సుధ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా : సి.వి.ఆనంద్, సంగీతం: ప్రమోద్ కుమార్, మాటలు: సూర్యప్రకాష్, రవీంద్ర గోపాల, పాటలు: రవీంద్ర గోపాల, ఎడిటింగ్: రామారావు, స్క్రీన్ప్లే, దర్శకత్వం, నిర్మాత: రవీంద్రజి.