Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ రూపా ప్రొడక్షన్ పతాకంపై మనీష్, మధునందన్, లావణ్య, అక్సాఖాన్, అలివియా ముఖర్జీ హీరో, హీరోయిన్స్‌గా తెరకెక్కిన చిత్రం 'క్షణం ఒక యుగం'.
శివబాబు దర్శకత్వంలో రూప నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ నక్కిన త్రినాధరావు గ్రాండ్‌గా విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, 'పోస్టర్ చాలా బాగుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గెటప్‌లో ఉన్న రూప పోస్టర్‌ను చూడగానే ఇది పోలీస్ కథ అనుకున్నాను. అయితే ఇది లవ్ స్టోరీనే అయినప్పటికీ కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది' అని అన్నారు. 'నటీనటులు, టెక్నీషియన్లు అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది' అని చిత్ర నిర్మాత రూప చెప్పారు. చిత్ర దర్శకుడు శివ బాబు మాట్లాడుతూ,'మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది' అని తెలిపారు.