Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన సినిమా 'కళ్యాణం కమనీయం'.
ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించింది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాద కరమైన కథనాలతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్బంగా నిర్వహించిన చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ, 'చిరంజీవి బాలకృష్ణ సినిమాలతో సంక్రాంతికి మళ్ళీ ఒక కళ వచ్చింది. వాళ్ళ సినిమాలతో పాటు మా సినిమా కూడా రిలీజ్ అవ్వడం హ్యాపీ. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల కంటే ఇది చాలా కొత్తగా ఉంటుంది' అని తెలిపారు. 'సినిమాలో చేసిన శృతి క్యారెక్టర్ ఎలాంటిదో నాది ఇంచుమించు అలాంటి క్యారెక్టరే' అని ప్రియ భవాని శంకర్ చెప్పారు. దర్శకుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ, 'జీవితంలో నేర్చుకోవాల్సిన చాలా పాఠాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సంక్రాంతికి సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా ఇది' అని అన్నారు.