Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివ కందుకూరి, రాశి సింగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'భూతద్ధం భాస్కర్ నారాయణ'. పురుషోత్తం రాజ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈచిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ నుంచి రీసెంట్గా విడుదల చేసిన మోషన్ పోస్టర్ వరకూ సినిమా కాన్సెప్ట్‌ని ఇన్సర్ట్ చేసి వైవిధ్యంగా ప్రెజెంట్ చేసిన నిర్మాతలు ఈ చిత్రాన్ని మార్చి 31న విడుదల చేస్తున్నారు. ఈ ప్రకటనని కూడా చిన్న మోషన్ పోస్టర్‌తో ఎనౌన్స్ చేయటం విశేషం.
'ఈ సినిమా ధియేటర్‌కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి ఎడ్జ్ ఆఫ్ ద సీట్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో ఏ సన్నివేశాన్నీ ముందుగా ఊహించడం చాలా కష్టంగా ఉండేలా దర్శకుడు స్క్రీన్‌ప్లే ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి' అని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజరు బుల్గానిన్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: గౌతమ్ జి, ఎడిటర్: గ్యారీ బిహెచ్, ప్రొడక్షన్ డిజైనర్: రోషన్ కుమార్, స్టంట్స్: వింగ్ చున్ అంజి.