Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'వారసుడు' (తమిళంలో వారిసు). రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మించారు. ఈనెల11న తమిళంలో విడుదలైన 'వారిసు' అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈనెల 14న 'వారసుడు'గా తెలుగులో విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ,'కష్టాల్లో కూడా మనకి తోడు ఉండేది మన కుటుంబమే. ప్రతి కుటుంబంలోనూ లోపాలు ఉంటాయి. కానీ ఉన్నది ఒకటే కుటుంబం. ఈ ఆలోచనతోనే వారసుడు కథ పై వర్క్ చేశాం. తమిళనాట ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసి అందరూ నిలబడి క్లాప్స్ కొడుతుంటే కన్నీళ్ళొచ్చాయి. 14వ తేదిన అదే రెస్పాన్స్ తెలుగు ప్రేక్షకుల నుండి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక తెలుగు గుండె తీసిన సినిమా. దిల్ రాజుకి కృతజ్ఞతలు' అని తెలిపారు.
''బొమ్మరిల్లు' సినిమాని శాంతి థియేటర్లో చూస్తున్నపుడు ఒక ఫోన్ కాల్ వస్తే నేను ఏడ్చా. మళ్ళీ ఇన్నాళ్ళుకు ఈ సినిమా చూస్తున్నపుడు కన్నీళ్లు వచ్చాయి. ఇది అనుకున్నది నిజం అవ్వడం వలన వచ్చే ఆనందం, సినిమాతో కనెక్ట్ అయితే ప్రేక్షకులు ఇచ్చే ఆదరణ' అని నిర్మాత దిల్రాజు అన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ,'దర్శకుడు వంశీ పైడిపల్లికి, తమిళ ఇండిస్టీలో సినిమా నిర్మించి, అక్కడ సూపర్ హిట్ కొట్టిన నిర్మాత దిల్ రాజుకి కంగ్రాట్స్. నేను తొలిసారి తమిళ్లో చేసిన సినిమా సూపర్ హిట్ కావడం ఆనందంగా ఉంది. ఇదొక హార్ట్ టచింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తమిళ్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుగులో కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది' అని చెప్పారు.