Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5తో హరీష్ శంకర్, నిర్మాత దిల్‌రాజు కలిసి 'ఏటీఎం' అనే వెబ్ సీరీస్‌ని రూపొందించారు. వీజే సన్నీ, కష్ణ, రవిరాజ్, రాయల్ శ్రీ, దివి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సి.చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ఈనెల 20న రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు చంద్ర మోహన్ మాట్లాడుతూ, 'ఈ కథను నాకు ఇచ్చి చేయమని చెప్పిన హరీష్ శంకర్‌కి థ్యాంక్స్' అని తెలిపారు. 'హరీష్ శంకర్ ఆలోచనల్లోంచే ఈ ఏటీఎం కథ పుట్టింది. దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. నటీనటులంతా కూడా చక్కగా నటించారు' అని నిర్మాత హన్షిత అన్నారు. మరో నిర్మాత హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, 'సుబ్బరాజు ఈ సినిమాలో నటించినందుకు థ్యాంక్స్. ఏటీఎంలో నటించిన నలుగురు కుర్రాళ్లు అద్భుతంగా నటించారు' అని తెలిపారు. డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు ప్రశంసలు వస్తే.. అవన్నీ దర్శకుడు చంద్ర మోహన్‌కు మాత్రమే దక్కాలి. సినిమాను అద్భుతంగా తీశారు. బడ్జెట్ విషయంలో సహకరించిన జీ5 టీంకు థ్యాంక్స్' అని చెప్పారు.