Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) కాంబోలో రూపొందిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల మీడియాతో మాట్లాడుతూ, 'దర్శకుడు బాబీ కథ చెబుతున్నపుడు నా ఆలోచనలు చాలా వరకూ మ్యాచ్ అయ్యాయి. వాల్తేరు, పోర్ట్ , ఫిషర్ మ్యాన్ అని చెప్పగానే ఒక ఇమాజినేషన్ వచ్చింది. బాబీ ముఖ్యంగా చెప్పిన విషయం ఏమిటంటే.. మాకు వింటేజ్ చిరంజీవి లుక్ కావాలని చెప్పారు. లుంగీ డిజైన్, ఎక్కడ ఎలాంటి కళ్ళజోడు ఉంటే బావుంటుందనే కొన్ని సూచనలు నాన్న కూడా ఇచ్చారు. 'వాల్తేరు వీరయ్య'గా నాన్నని తెరపై చూసినప్పుడు అద్భుతంగా అనిపించింది. ఒక పెద్ద పండగలా అనిపించింది. లుక్ టెస్ట్ చేసినప్పుడే అమ్మ, రామ్‌చరణ్ ఎలా ఉందో చెప్పేస్తారు. ఇక నిర్మాతగా భవిష్యత్‌లో నాన్నతో సినిమా తీస్తాను. ప్రస్తుతం నాన్నతోనే 'భోళాశంకర్'కి చేస్తున్నాను. అలాగే రెండు వెబ్ సిరిస్లపై వర్క్ చేస్తున్నాం. 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది' అని తెలిపారు.