Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ చేతులు కలిపాయి. విజయ్ కెరీర్లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్.నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రకటన సందర్భంగా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేశారు. అందులో ఓ వ్యక్తి పోలీసు దుస్తుల్లో ముఖానికి ముసుగు ధరించి గూఢచారిని తలపిస్తున్నాడు. దీంతో ఇదొక స్పై ఫిల్మ్ అని పోస్టర్ని బట్టి అర్థమవుతోంది. అలాగే సముద్రతీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్ను ఆసక్తి రేకెత్తించేలా రూపొందించారు. చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానున్న ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను నిర్మాతలు ప్రకటించనున్నారు.