Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో రూపొందిన చిత్రం 'వీరసింహారెడ్డి'.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై, అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో వీర మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.
ఈ నేపథ్యంలో దర్శకుడు గోపీచంద్ మలినేని విలేకరులతో మాట్లాడుతూ, 'ఈ సినిమా ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించడం ఆనందంగా ఉంది.
ఈ సినిమాని ఒక అవకాశం కంటే ఒక బాధ్యతగా చేశాను. బాలకష్ణ 'అఖండ', అన్ స్టాపబుల్ షోతో మాస్,
యూత్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అందరిలోకి వెళ్ళిపోయారు. అలాగే అందరి హీరోల
ఫ్యాన్స్ బాలయ్య అభిమానులే. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఆయన గాడ్ అఫ్ మాసెస్ ఇమేజ్ , నా ఫ్యాన్ మూమెంట్స్‌తో కలిపి ఈ కథ చేశాను. సర్ప్రైజింగ్ ఎలిమెంట్‌గా సిస్టర్ సెంటిమెంట్ పెట్టాం. అలాగే ఇందులో డైలాగులు కథ నుండి పుట్టాయి. కథలో అంత సహజంగా ఉన్నాయి. కాబట్టే ప్రేక్షకులందరూ ఇంత గొప్పగా ఆదరిస్తున్నారు. 'క్రాక్' తర్వాత మా అబ్బాయి ఇందులోనూ చక్కగా నటించాడు. తమన్ మ్యూజిక్, రామ్‌లక్ష్మణ్ ఫైట్స్, మైత్రీ మూవీ మేకర్స్ మేకింగ్ అత్యద్భుతం' అని అన్నారు.