Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కళ్యాణం కమనీయం' సంక్రాంతికి విడుదలవుతున్న కుటుంబ కథా చిత్రం. సంతోష్ శోభన్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించింది. యువి కాన్సెప్ట్ నిర్మించిన ఈ చిత్రంతో అనిల్ కుమార్ ఆళ్ళని దర్శకుడిగా పరిచయం చేశారు. తన తొలి తెలుగు సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సందర్భంగా నాయిక ప్రియా భవాని శంకర్ మీడియాతో మాట్లాడుతూ,'యువి వంటి పెద్ద బ్యానర్‌తో తెలుగులో లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇగో సమస్యలు లేని ఒక భార్య, భర్త మధ్య జరిగిన సంఘటనలు, వాటితో కూడిన సన్నివేశాలతో చిత్రం ఆద్యంతం అలరిస్తుంది. పనిలేని భర్త శివ, ఉద్యోగానికెళ్ళే భార్య శృతి, ఇద్దరి మధ్య చుట్టూ ఉన్నవాళ్ళ మాటలు, అభిప్రాయాల వల్ల మొదలైన ఒక సమస్య ఎంత దూరం వెళ్ళింది అన్నదే కథాంశం. నేను పోషించిన శృతి పాత్రకి, నాకు దాదాపు 90 % పోలికలున్నాయి. ఈ శృతి పాత్రలో మీ చెల్లెళ్ళు, అమ్మలు, కూతుర్లు అందరూ తమని తాము చూసుకుంటారు' అని చెప్పారు.