Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శుక్ర', 'మాటరాని మౌనమిది' చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్న సుకు పూర్వాజ్ తాజాగా తన మూడో సినిమా 'ఏ మాస్టర్ పీస్'కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు.
మంగళవారం ఈ సినిమా హీరో సూవర్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈసారి దర్శకుడు ఈ సినిమా ను హాలీవుడ్ రేంజ్లో సరికొత్త కంటెంట్, ప్రెజంటేషన్‌తో రూపొందించనున్నట్టు పోస్టర్ చూస్తే తెలుస్తోంది.
తమ సూపర్ హీరో ఎలా ఉండబోతున్నాడో, తను ఈ సినిమాని ఎలా చూపించబోతున్నాడో ఒక్క పోస్టర్‌తో చెప్పాడు దర్శకుడు. పిల్లలకు ఎంతో ఇష్టమైన సూపర్ హీరోను మన తెలుగు ప్రేక్షకులకు కూడ పరిచయం చేస్తూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రికరించబోతున్నాం అంటూ దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ నెల26 నుండి ఫిబ్రవరి 10 వరకు అరకులో మొదటి షెడ్యూల్, ఫిబ్రవరి 18 నుండి మార్చి 30 వరకు రెండవ షెడ్యూల్, చివరగా కులుమనాలి లో ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 10వ తేదీతో షూటింగ్ పూర్తి చేయనున్నట్లు నిర్మాత చెప్పారు. అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ ఆషురెడ్డి, స్నేహా గుప్త తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.