Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'భూమ్మీద ఎందరో పుడతారు, గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. తమ స్వశక్తితో అత్యున్నస్థితికి వెళ్లాలంటే అకుంఠిత దీక్ష కావాలి నిరంతర ప్రయత్నం జరగాలి. అలాంటి వారిలో శిఖర సమానులు ఏల్వి ప్రసాద్ గారు' అని హీరో బాలకృష్ణ అన్నారు.
మంగళవారం ప్రసాద్ లాబ్స్‌లో ఆకృతి ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్116వ జయంతి, ఆకృతి- ఎల్వి ప్రసాద్ పురస్కార ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా పురస్కారం స్వీకరించిన బాలకృష్ణ భావోద్వేగంతో ప్రసంగించారు. 'నాన్న గారితో ప్రసాద్ గారి అనుబంధం ఎంతో ప్రత్యకమైనది. ఆయనలోని ప్రతిభను మొదట గుర్తించింది ఎల్వి ప్రసాద్ గారు. అందుకే 'మనదేశం'లో వేషం ఇచ్చి 'పల్లెటూరి పిల్ల'లో హీరోని చేశారు. అంతే ఇక నాన్న వెనుదిరిగి చూసుకోలేదు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా. కె. వి. రమణ పురస్కారం ప్రదానం చేసి ప్రసంగించారు. మరో విశిష్ట అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బి. సి. కమిషన్ చైర్మన్ డా. వకులా భరణం కృష్ణ మోహన్ రావు ప్రసంగిస్తూ మూడు భాషల తెలుగు టాకీలో నటించిన ప్రసాద్ గారు చిరస్మరనీయులు అన్నారు. సీల్ వెల్ కార్పొరేషన్ చైర్మన్ బండారు సుబ్బారావు సభకు అధ్యక్షత వహించగా, ఆకృతి సుధాకర్ సమన్వయ బాధ్యతలు నిర్వహించారు.