Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భిన్న పాత్రలు, సినిమాలతో అలరిస్తున్న నటుడు సుహాస్ నటించబోయే కొత్త సినిమా బుధవారం రామానాయుడు స్టూడియోలో పూజతో ప్రారంభమైంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా రానా దగ్గుబాటి, ఆనంద్ దేవరకొండ, క్రిష్, నందిని రెడ్డి, బివిఎస్ రవి హాజరయ్యారు. రానా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయగా, క్రిష్ స్క్రిప్ట్‌ను టీమ్‌కి అందజేశారు. 'ఆనందరావు అడ్వెంచర్స్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో నూతన దర్శకుడు రామ్ పసుపులేటి మెగాఫోన్ పట్టనున్నారు. ఈ ఫెయిరీ టేల్ ఫాంటసీ చిత్రాన్ని గ్జైపీ స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.4గా నిర్మించబోతోంది. ఉదరు కోలా, విజరు శేఖర్ అన్న, సురేష్ కోతింటి నిర్మాతలు, సుహాసిని రాహుల్, మురళీ జంపన సహ నిర్మాతలు. ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ, 'పోస్టర్లోనే కంటెంట్ తెలిసిపోయింది. దర్శకుడు నాకు మంచి స్నేహితుడు. తను చెప్పిన కథ నాకెంతో బాగా నచ్చింది' అని తెలిపారు. మంచి కథతో మీముందుకు వస్తున్నాం అని సహ నిర్మాత సుహాసిని చెప్పగా, చిల్డ్రన్ ఫాంటసీ కథతో ఈ సినిమా అందర్నీ అలరించడం ఖాయమని దర్శకుడు రామ్ పసుపులేటి చెప్పారు.