Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా 'బుట్ట బొమ్మ'. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈనెల 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నటుడు అర్జున్ దాస్ మీడియాతో మాట్లాడుతూ, ''ఖైదీ, అంధఘారం, మాస్టర్' సినిమాల నుంచి కెరీర్ ఊపందుకుంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ సినిమాలలో భాగం కావడం, అలాగే సితార వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలో ఈ సినిమా చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మాతక ఓటీటీలో అందుబాటులో ఉంది. అయినా రీమేక్ ఎందుకు చేస్తున్నారని నిర్మాత వంశీని అడిగాను. ఇది తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందనే నమ్మకం ఉందన్నారు. దర్శకుడు రమేష్ ఈ చిత్రాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఇందులో నా పాత్ర పేరు ఆర్.కె. నా పాత్ర గురించి సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. తెలుగు ప్రేక్షకుల నుంచి నాకు లభిస్తున్న ఆదరణ అసలు ఊహించలేదు. నేను అన్ని రకాల పాత్రలు చేయడానికి రెడీ' అని అన్నారు.