Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలను అధ్యక్షుడు సి.కళ్యాణ్ బుధవారం ఎఫ్.ఎన్.సి.సి.లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గత కొద్దిరోజులుగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిపై వస్తున్న అనేక అరోపణలకు సమాధానంగా సి.కళ్యాణ్ మాట్లాడుతూ, ''ఆర్గనైజేషన్‌కి ఎవరు చెడ్డ పేరు తెచ్చినా ఊరుకోము. అలాంటి వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ప్రొడ్యూసర్ కె.సురేష్ కుమార్‌ని మూడేళ్లు సస్పెండ్ చేశాం. అలాగే యలమంచి రవికుమార్‌ని ఈరోజు నుంచి మా సంస్థ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నాం. ఈ సంస్థ ఒక్కటే.. దీనిని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉంది. ఫిబ్రవరి 19న తెలుగు చలన చిత్ర మండలి ఎన్నికలను నిర్వహిస్తున్నాం. దీనికోసం ఫిబ్రవరి 1 నుంచి 6వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. కె. దుర్గా ప్రసాద్ ఎన్నికల అధికారిగా కొనసాగుతారు. మా కౌన్సిల్లో ప్రస్తుతం 9 కోట్ల ఫండ్ ఉంది. అలాగే మాకు తిరుపతిలో ఒక బిల్డింగ్ ఉంది. మూవీ టవర్స్‌లో రెండు కోట్ల 40 లక్షలు పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు అది 10 కోట్లకు చేరింది. డిసెంబర్ 31వ తేదీ వరకు అకౌంట్స్ అన్ని ఈసీలో పాస్ అయినవే. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సినీ పరిశ్రమకు ఒరిగేదేమీ లేదు. గతంలో అందాల్సిన సబ్సిడీలే ఇంకా రాలేదు. పైగా గతంలో ఇచ్చిన నంది, ఇక్కడ సింహ అవార్డుల గురించి ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడి మా సినిమారంగంపై రాజకీయరంగు పులమకండి అని ప్రాధేయపడతాం' అని తెలిపారు.