Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ నటించిన 'వారసుడు' ఈనెల 14న తెలుగులో విడుదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మించారు. ఈ సినిమా గురించి దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, 'ఈ చిత్రం త్వరలోనే 'మాస్టర్'ని మించి తెలుగు రాష్ట్రాల్లో విజరుకి అతిపెద్ద హిట్‌గా నిలవబోతుంది. నేను తమిళంలో తీసిన మొదటి సినిమానే పెద్ద హిట్ అయింది. మా నిర్మాత దిల్ రాజుకి ఈ సినిమా డబ్బుతో పాటు గౌరవం తెచ్చి పెట్టింది. తెలుగు, తమిళం.. భాష ఏదైనా ఇందులోని ఎమోషన్స్ అందరికీ బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఈ సినిమాలో తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో టచ్ చేశారంటూ ప్రతి రోజూ నాకు కాల్స్ వస్తున్నాయి. మా నాన్నగారు కూడా నన్ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా మౌత్ టాక్ సూపర్బ్. మనవళ్ళు తాతయ్యలతో సహా తమ కుటుంబ సభ్యులకు ఈ చిత్రాన్ని చూడమని చెప్తున్నారు. హిందీలో కూడా మా సినిమాకి ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. తమిళంలో మా సినిమా రిపీట్ ఆడియన్స్‌తో దూసుకుపోతోంది. ఇదొక బెంచ్ మార్క్ సెట్ చేయబోతోంది. తమిళంలో చాలా కాలం తర్వాత విజరు చేసిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది' అని చెప్పారు.