Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి 'బుట్ట బొమ్మ' అనే మరో ఆసక్తికరమైన చిత్రం రాబోతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ఫిల్మ్‌కి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఈనెల 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాయిక అనిక సురేంద్రన్ మీడియాతో ముచ్చటించారు.
'ఎన్నో ఏళ్లుగా బాల నటిగా సినిమాల్లో నటిస్తూ వచ్చాను. ఇప్పుడిలా హీరోయిన్గా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. 'కప్పేలా' మలయాళ వెర్షన్ చూశాను. చాలా నచ్చింది. నా పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. నటనకు కూడా మంచి ఆస్కారం ఉన్న పాత్ర. తొలిసారి హీరోయిన్గా నటించడాన్ని కొంత ఒత్తిడిగా ఫీలయ్యాను. పైగా నాది సినిమాలో ప్రధాన పాత్ర. అయితే దర్శకుడు రమేష్, మిగతా చిత్ర యూనిట్ మద్దుతుతో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా సినిమాని పూర్తి చేయగలిగాను. రీమేక్ పరంగా మూల కథ అలాగే ఉంటుంది. కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. ఒరిజినల్ ఫిల్మ్ కంటే కూడా ఇది ఇంకా కలర్ఫుల్గా ఆకట్టుకునేలా ఉంటుంది. నేను ఇప్పటిదాకా పని చేసిన ఉత్తమ నిర్మాణ సంస్థల్లో సితార ఒకటి. నిర్మాత వంశీ నన్ను ఈ చిత్రం కోసం ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. సితార లాంటి పెద్ద సంస్థలో హీరోయిన్గా మొదటి సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా విడుదలకు ముందే తెలుగులో ఇంకా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మలయాళంలో 'ఓ మై డార్లింగ్' అనే మూవీలో హీరోయిన్గా నటిస్తున్నాను. తమిళంలో ఒక మూవీ చేస్తున్నాను. అలాగే కొన్ని తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి' అని నాయిక అనిక సురేంద్రన్ అన్నారు.