Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5తో హరీష్ శంకర్ కలిశారు. ఆయనకు సపోర్ట్‌గా దిల్‌రాజు కూడా జాయిన్ అయ్యారు. వీరిద్దరూ కలిసి 'ఏటీఎం' అనే వెబ్ సీరీస్‌ని రూపొందించారు. బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ,కృష్ణ, రవిరాజ్, రాయల్ శ్రీ, దివి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సి.చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ఈనెల 20న ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్ అవుతుంది. ఈ సందర్బంగా బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ, 'పోస్ట్ ప్రొడక్షన్ టైమ్‌లో సినిమా చూశాను. దర్శకుడు చంద్రలో మంచి కామెడీ టైమింగ్ ఉంది. కంటెంట్‌ను ప్యూర్‌గా చెప్పొచ్చు అనే ప్యాషన్‌తో ఓటీటీల్లోకి వచ్చాం. దానికి సపోర్ట్ చేసిన జీ5కి థ్యాంక్స్' అని అన్నారు.
'ట్రైలర్ చూడగానే సినిమా ట్రైలర్‌గానే అనిపించింది. చంద్ర కంటెంట్‌ను హ్యాండిల్ చేసిన తీరు నచ్చింది. టెన్షన్ పడుతూనే సిరీస్‌ను ఎంజారు చేస్తారు' అని నిర్మాత దిల్ రాజు చెప్పారు. దర్శకుడు సి.చంద్ర మోహన్ మాట్లాడుతూ, 'మంచి టీమ్ దొరికినందుకు హ్యాపీగా ఉంది. టాప్ టెక్నీషియన్స్ కుదిరారు. సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఈ వెబ్‌సిరీస్ అందర్నీ కచ్చితంగా అలరిస్తుంది' అని తెలిపారు.'ఈ వెబ్‌సిరీస్ నా జీవితంలో మరచిపోలేని జర్నీ. మా కెప్టెన్ చంద్రమోహన్‌తో వర్క్ చేయటం అమేజింగ్' అని వీజే సన్నీ చెప్పారు. నిర్మాత హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, ''ఈ సిరీస్ హరీష్‌గారి ఐడియా నుంచి స్టార్ట్ అయ్యింది. సన్నీ, రోయల్, కృష్ణ, రవి మంచి యాక్టర్స్‌గా పేరు తెచ్చకుంటారు. సుబ్బరాజ్ మా కోసం ఇందులో నటించారు' అని చెప్పారు. నిర్మాత హన్షిత మాట్లాడుతూ, 'ఇదొక గేమ్ చేంజర్ అని నమ్ముతున్నాం. నాన్నగారి మైండ్, హరీష్ అన్న గుండె కలిసే ఈ సిరీస్ క్రియేట్ అయ్యింది. నాన్న చెప్పినట్టు టెన్షన్ పెడుతూనే ఇది నవ్విస్తుంది' అని తెలిపారు.