Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్ తేజ్ హీరోగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'గాండీవధారి అర్జున' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. గురువారం వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఇందులో వరుణ్ తేజ్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా నటిస్తున్నారు. ఎదుటి వారిని ప్రమాదాల బారి నుంచి కాపాడే రోల్లో ఆయన నటించటంతో 'గాండీవధారి అర్జున' టైటిల్‌ను ఖరారు చేసినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. మిక్కి జె.మేయర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మాత బి.వి.ఎస్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.