Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రుహాని శర్మ ప్రధాన పాత్రధారిగా 'హర్' అనే ఓ వైవిధ్యభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తొలిసారి ఫిమేల్ లీడ్ చేస్తూఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను యువ కథానాయకుడు నాని రిలీజ్ చేసి, చిత్ర బృందానికి అభినందలు తెలిపారు.
ఈ టీజర్లో రుహాని శర్మ క్యారెక్టర్ హైలైట్ అయింది. ఆమె ఓ ఛాలెంజింగ్ రోల్ చేసిందని కొన్ని సన్నివేశాలు ప్రూవ్ చేశాయి. ఆద్యంతం ఆసక్తికరంగా దర్శకుడు శ్రీధర్ స్వరగావ్ రూపుదిద్దిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్‌గా ఈ సినిమాను 'హర్ చాప్టర్ 1'గా రిలీజ్ చేయబోతున్నారు. రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్య, సంజరు స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డిఓపీ : విష్ణు బేసి, ఎడిటింగ్: చాణక్య తూరుపు, మ్యూజిక్: పవన్.