Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తున్న చిత్రం 'పాప్ కార్న్'. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్తా (నెపోలియన్, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్ అవికా గోర్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించటం విశేషం.
మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా 'మది విహంగమయ్యే...' అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు హీరో నాగ చైతన్య. సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఆయన యూనిట్‌కి అభినందనలు తెలిపారు.
శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ పాటను శ్రీజో రాయగా, బెన్నీ దయాల్, రమ్యా బెహ్రా చక్కగా ఆలపించారు.ఈ సందర్భంగా సమర్పకుడు ఎం.ఎస్.చలపతి రాజు మాట్లాడుతూ, 'ఇప్పటి వరకు రానటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. సినిమా అంతా లిఫ్టులోనే ఉంటుంది. ముఖ్యంగా చివరి 45 నిమిషాలు అయితే సీట్ ఎడ్జ్ మూవీలా ఉంటుంది. పెద్దలకు వారి యంగ్ ఏజ్ గుర్తుకు వస్తుంది. ఇప్పటి యువతకు కూడా కనెక్ట్ అవుతుంది. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న సినిమా. డైరెక్టర్ మురళి గంధం టేకింగ్‌ను అందరూ తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు' అని అన్నారు.
'డిఫరెంట్ మూవీ. డైరెక్టర్ మురళిగారు నెరేషన్ వినగానే ఓకే చెప్పేశాను. ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాను. కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 10న పాప్ కార్న్‌తో సందడి చేయబోతున్నాం' సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన అవికా గోర్ చెప్పారు.
హీరో సాయి రోనక్ మాట్లాడుతూ, ''సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే ప్రేక్షకులు సినిమాలోకి లీనమైపోతారు. ఇక చివరి 45 నిమిషాలైతే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మూవీ అలరిస్తుంది' అని చెప్పారు.