Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు వంటి హేమాహేమీలను కోల్పోయిన చిత్ర సీమ సీనియర్ నిర్మాత సూర్యనారాయణను కోల్పోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. పలు భిన్న సినిమాల నిర్మాణంతో అభిరుచిగల నిర్మాతగా పేరొందిన ఆయన ఎన్టీఆర్‌తో 'అడవిరాముడు' వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ సత్యచిత్ర బ్యానర్‌పై తహసిల్దార్ గారి అమ్మాయి (1971), ప్రేమ బంధం (1976), అడవిరాముడు (1977), కుమార రాజా (1978), కొత్త అల్లుడు (1979), కొత్తపేట రౌడీ (1980), ఏది ధర్మం ఏది న్యాయం (1982), ఉద్ధండుడు (1984), భలే తమ్ముడు (1985) తదితర చిత్రాలను నిర్మించారు. ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ, బాలకృష్ణ లతో సినిమాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్నారు. 'కుమార రాజా' చిత్రంలో హీరో కృష్ణ త్రిపాత్రాభినయం చేస్తే, 'కొత్త అల్లుడు' సినిమాలో చిరంజీవి విలన్‌గా నటించటం విశేషం. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌తో 'మహాన్' చిత్రాన్ని నిర్మించిన సూర్యనారాయణ మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.