Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుహాస్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'రైటర్ పద్మభూషణ్'. ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మాతలు కాగా జి. మనోహరన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్లో హీరో అడివి శేష్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.
ఈ సందర్బంగా నిర్మాత అనురాగ్ మాట్లాడుతూ,''రైటర్ పద్మభూషణ్'తో పాటు మరో నాలుగు సినిమాలు అంతా కొత్తవారితోనే ఫైనల్ అయ్యాయి. సుహాస్‌ని యూట్యూబ్‌లో సపోర్ట్ చేశారు. ఓటీటీలో సపోర్ట్ చేశారు. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ మీ పేరెంట్స్‌తో కలిసి ఈ సినిమా చూడాలని మా విన్నపం' అని అన్నారు.
'శరత్, అనురాగ్, చంద్రుకి కృతజ్ఞతలు. శరత్, అనురాగ్ లేకపోతే నేను లేను. ఇంతమంచి సినిమాని నా దగ్గరకి తీసుకొచ్చిన ప్రశాంత్‌కి కృతజ్ఞతలు. మ్యూజిక్ చేసిన శేఖర్ చంద్రకి, బిజియం చేసిన కళ్యాణ్‌కి, ఎడిటర్ పీకేకి, డీవోపీ వెంకట్ రమణకి కృతజ్ఞతలు. ఇది నా మొదటి థియేట్రికల్ రిలీజ్ సినిమా. సినిమా చూసిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా రెండు, మూడు గంటలు హ్యాంగోవర్లో ఉంటారు' అని సుహాస్ చెప్పారు. దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ మాట్లాడుతూ, 'ఛారు బిస్కెట్, లహరి ఫిలిమ్స్‌తో నా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని ఒక ఫ్యామిలీ కోసం స్పెషల్ షో వేశాం. 'పిల్లలకి చూపించాల్సిన సినిమా ఇది' అని ప్రసంశించారు. ఇది నేను ఇప్పటివరకూ అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్. క్లాప్స్‌తో పాటు క్యాష్ తీసుకొచ్చే చిత్రమిది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది' అని చెప్పారు.
నిర్మాతలు శరత్, చంద్రు మాట్లాడుతూ, ''మేజర్' లాంటి పెద్ద సినిమాని ఎ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్లో చేశాం. ఈ సినిమాకి దాదాపు అందరూ కొత్తవాళ్ళే చేశారు. సుహాస్‌కి ఇది తొలి థియేటర్ రిలీజ్ మూవీ. లహరి మ్యూజిక్ 35 ఏళ్లుగా మ్యూజిక్ ఇండిస్టీలో ఉంది. తొలిసారి ఈ చిత్రంతో ప్రొడక్షన్ చేయడం, మా ఛారు బిస్కెట్‌తో అసోసియేట్ కావడం ఆనందంగా ఉంది' అని తెలిపారు.