Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం ఉన్న సినిమాలకు సంగీతం ఎంతగా ప్లస్ అవుతుందో అందరికీ తెలిసిందే. పాటలు బాగుంటే, సంగీతానికి మంచి ఆదరణ లభిస్తే సినిమాలు హిట్ అవుతాయని అంతా నమ్ముతుంటారు.
అలాంటి ఓ సినిమానే ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది. మహిళా దర్శక, నిర్మాతలు కలిసి చేస్తున్న చిత్రం 'ఓ సాథియా'. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ పై చందన కట్టా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజ్య సభ సభ్యుడు, లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది.
ఇప్పుడు ఈ సినిమా నుంచి 'ఓ సాథియా' అంటూ సాగే పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను అగ్ర సంగీత దర్శకుడు మణిశర్మ రిలీజ్ చేశారు. ఈ పాట అందరినీ మెప్పించేలా ఉంది. భాస్కర భట్ల సాహిత్యం, విన్ను అందించిన బాణీ, జావెద్ అలీ గాత్రం పాటను వినసొంపుగా మలిచాయి. ఇక ఈ లిరికల్ వీడియోలోని విజువల్స్ చూస్తే సినిమాను ఎంత రిచ్‌గా తీశారో అర్థమవుతుంది. ఈజే వేణు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుందని తెలుస్తోంది.
ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా మీద ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ అయింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.