Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నటుడు సుహాస్ నటించిన తాజా చిత్రం 'రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛారు బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు.
ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ఆశిష్ విద్యార్ధి మీడియాతో మాట్లాడుతూ, 'ఈ సినిమాలో పని చేయడం చాలా గర్వంగా ఉంది. మంచి హ్యుమర్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో ఒక మధ్యతరగతి తండ్రిగా తన కొడుకు ఏదో సాధిస్తాడనే ఆశ పడే పాత్ర. తనకి ఒక ఫిక్డ్స్ లైఫ్ స్టయిల్ ఉంటుంది. ప్రతి రూపాయిని లెక్కపెట్టుకునే తండ్రి. అయితే తన జీవితంలో ఏదో డిఫరెంట్‌గా జరుగుతుంది. చివర్లో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది. సినిమా చూసిన వారు రివ్యూ ఇవ్వండి. కానీ దయచేసి ఆ ట్విస్ట్‌ని మాత్రం రివీల్ చేయొద్దు. చాలా మంచి హ్యుమర్, ఎమోషన్ ఉంటుంది. చాలా నిజాయితీగా తీసిన చిత్రమిది. సుహాస్ చాలా సహజంగా ఉంటాడు. తనకి మంచి భవిష్యత్ ఉంటుంది. నాని, సుహాస్‌లో చాలా సిమిలారిటీస్ కనిపించాయి. ఛారు బిస్కెట్ సంస్థ నిర్మాతలు అనురాగ్, శరత్ చాలా క్లియర్ విజన్ ఉన్నవాళ్ళు. సినిమా అంటే వాళ్ళకి ప్యాషన్. మోడ్రన్ మైండ్ సెట్‌తో ఉంటారు. ఇక దర్శకుడు కొత్తవాడైనప్పటికీ ఈ కథను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు' అని తెలిపారు.