Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్, ఇమేజ్ సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ఆమె తొలి తెలుగు సినిమా ఇది.
రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ హై స్టైలిష్ యాక్షన్ మూవీ నుంచి ఇటీవల చిత్ర యూనిట్ 'యెక యెక..' అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది.
ఒకేలా ఉండి ఒకరికొకరు సంబంధం లేని ముగ్గురు వ్యక్తులు మంజునాథ్, సిద్ధార్థ్, మైకేల్ మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ పాట తెలియ జేస్తుంది. ఈ మూడు పాత్రలను కళ్యాణ్ రామ్ పోషించారు. అలాంటి ముగ్గురు అమిగోస్ (అమిగోస్ అంటే స్నేహితుడిని పిలిచే స్పానిష్ పదం) ఎంత సంతోషంగా ఉన్నారనేది పాటలో ఎలివేట్ చేశారు. ఈ పాటను సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాయగా, అంతే గొప్పగా అనురాగ్ కులకర్ణి పాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న ఈ సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు.
ఇటీవల 'బింబసార' చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న కళ్యాణ్‌రామ్ ఈ సినిమాతోనూ అదే స్థాయి సక్సెస్‌ని పొందటం ఖాయం అని మేకర్స్ దీమాగా ఉన్నారు.