Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్'. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేసి, చిత్ర యూనిట్కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ,' బాలకృష్ణ ట్రైలర్ చూసి 'అదిరిపోయింది' అని చెప్పారు. ఇది పూర్తిగా తెలుగు సినిమా. మన సినిమా. మనమందరం గర్వపడే సినిమా. రంజిత్ అద్భుతంగా తెరకెక్కించాడు. నిర్మాతలు ఇప్పటివరకూ ఎప్పుడూపెట్టని బడ్జెట్ ఈ సినిమా కోసం పెట్టారు. ఎప్పుడూ చేయని బిజినెస్ చేశారు' అని తెలిపారు.
'ఈ సినిమా చేయడానికి కారణం సందీప్ కిషన్. తనే ఫోన్ చేసి ఈ పాత్ర గురించి చెప్పి నాకు కొత్తగా ఉంటుందని చెప్పాడు. ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు. ఖచ్చితంగా కొత్తగా క్రేజీగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత సందీప్ నెక్స్ట్ లెవల్లో ఉంటారు. ఫిబ్రవరి 3 అందరూ ఈ చిత్రాన్ని చూడండి' అని వరుణ్ సందేశ్ అన్నారు.
దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ,'మా హీరో, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది' అని చెప్పారు. 'సినిమా కంటెంట్, బిజినెస్ పరంగా నిర్మాతలుగా మేం హ్యాపీగా ఉన్నాం. హీరో, దర్శకుడి కష్టం ట్రైలర్లో చూశారు. సక్సెస్ మీట్లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం' అని నిర్మాత భరత్ చౌదరి తెలిపారు. డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు జాయింట్ ప్రొడక్షన్ వెంచర్ ఇది. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు.