Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్నడ చలనచిత్ర పరిశ్రమలో శివ రాజ్‌కుమార్ ఒక ఐకానిక్ హీరో. ఆయన తాజాగా నటించిన చిత్రం 'వేద'. ఈ సినిమా ఆయనకు చాలా ప్రత్యేకమైన చిత్రం. ఆయన కెరీర్లో 125 చిత్రాల మైలురాయిగానే కాకుండా, ఆయన భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వం వహిస్తున్న సొంత నిర్మాణ సంస్థ గీతా పిక్చర్స్‌లో ఇది మొదటి వెంచర్‌గా కూడా కావడం విశేషం.
ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా త్వరలో తెలుగులో రిలీజ్‌కు సిద్దమవుతుంది. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించింది చిత్ర బృందం. ఎ.హర్ష దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలైంది. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం :హర్ష, నిర్మాత : గీతాశివరాజ్‌కుమార్, సినిమాటోగ్రఫీ : స్వామి జె గౌడ్, ఎడిటర్: దీపు ఎస్ కుమార్, సంగీతం: అర్జున్‌జన్య.