Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, కైకాల సత్య నారాయణ, చలపతి రావు వంటి ప్రముఖులను కోల్పోయిన తెలుగు చిత్ర సీమ తాజాగా మరో ప్రముఖ నిర్మాత ఎ.సూర్యనారాయణని కోల్పోయింది. ఆయన సంతాప సభను ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల మండలి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సంతాప సభలో నిర్మాతలు సి.కళ్యాణ్, కె.ఎస్.రామారావు, ప్రసన్న కుమార్‌తో పాటు దామోదర్ ప్రసాద్, భరద్వాజ తమ్మారెడ్డి, నిర్మాత నహీం, శివ రామకృష్ణతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని ఆయన ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ,'సూర్య నారాయణ గారితో నాకు ఉన్న బంధం 30 ఏళ్లు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే అది ఆయన పెట్టిన భిక్షే. ఇండిస్టీలో ఆయన అజాత శత్రువు' అని తెలిపారు. 'ఎన్టీఆర్‌తో చేసిన 'అడవి రాముడు' తెలుగు ఇండిస్టీకే అతి ముఖ్యమైన సినిమా. అలాంటి సినిమాను సూర్య నారాయణ నిర్మించారు' అని మరోనిర్మాత కె.ఎస్ రామారావు చెప్పారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ,'ఫిల్మ్ ఛాంబర్‌కి ఉన్న ప్రతి ఇటుకలో సూర్య నారాయణ భాగస్వామ్యం ఉంది. ఇండిస్టీకి ఇంకా ఏం చేయాలి.. అంటూ నిత్యం ఆలోచించే వ్యక్తి ఆయన' అని తెలిపారు.