Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్ కథానాయకుడిగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించనున్న హై-బడ్జెట్ చిత్రం కోసం 'హిట్' ఫ్రాంచైజ్‌తో వరుస విజయాల్ని అందించిన దర్శకుడు శైలేష్ కొలనుతో చేతులు కలపనున్నారు.వెంకటేష్ నటించనున్న 75వ చిత్రమిది. 'శ్యామ్ సింగరాయ్' నిర్మాణంతో విజయవంతంగా అడుగుపెట్టిన నిహారిక ఎంటర్టైన్ మెంట్ నుంచి ఈ సినిమా ప్రొడక్షన్ నెం2గా రాబోతుంది. వెంకటేష్ కెరీర్లో ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా కానుంది. ప్రీ లుక్ పోస్టర్లో వెంకటేష్ చేతిలో ఏదో పట్టుకున్న సిల్హౌట్ ఇమేజ్ కనిపిస్తుంది. అది గన్ కాదు.. మరి అదేంటో అనే విషయం ఈ నెల 25న తెలియనుందని మేకర్స్ ప్రకటించారు.