Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'వీరసింహారెడ్డి'. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 12న గ్రాండ్‌గా విడుదలై, అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. అన్ని చోట్లా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించి బాలకృష్ణ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా 'వీరసింహుని విజయోత్సవం' పేరుతో వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలో బాలకృష్ణ చేతుల మీదగా చిత్ర యూనిట్‌కు మెమెంటో ప్రదాన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ,'దర్శకుడు గోపీచంద్ ఒక అద్భుతమైన కథని రాశాడు. ఇది ఒక గొప్ప ప్రయాణం. ఈ ప్రయాణంలో అద్భుతమైన సినిమా చేశాం. తెలుగు ప్రేక్షకులతో పాటు సినిమా అభిమానులు అద్భుతంగా వుందని ప్రసంశించారు. ఈ సినిమా లార్జర్ దెన్ లైఫ్ మూవీ. ఇన్ని రకాల పాత్రలు చేశానంటే అది నా అదృష్టం. ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. వీరసింహారెడ్డిలో ఒక విస్పోటనం జరిగింది. ఈ సినిమాని ఇంత పెద్ద విజయాన్ని చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మైత్రీ మూవీ మేకర్స్‌కి సినిమా అంటే ప్యాషన్. అందరి హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఎక్కడా రాజీపడకుండా సినిమానే ఊపిరిగా జీవిస్తున్న నిర్మాతలు రవి, నవీన్ గారు. ఒక మంచి సినిమాకి పని చేసి ఫలితం కోసం ఎదురుచూస్తున్న మాకు ప్రేక్షకులు ఇంత ఘన విజయం ఇచ్చారంటే, మా వెన్నుతట్టి ఇంకా ఇలాంటి మంచి సినిమాలు ఇవ్వండి అంటూ మమ్మల్ని పోత్సహిస్తున్న ప్రేక్షకదేవుళ్లుందరికీ శిరస్సువంచి కృతజ్ఞతలు' అని చెప్పారు.
'ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఒక పండగలా ఉంటే, వీరసింహరెడ్డి మరో పండగ తీసుకొచ్చింది. మా సినిమాని ఇంతపెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి రుణపడి వుంటాను. ఒక ఫ్యాన్‌గా ఈ సినిమా తీశా. ఫ్యాన్స్, ఫ్యామిలీస్ కలిస్తేనే సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది' అని దర్శకుడు గోపీచంద్ మలినేని అన్నారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ,'ఇంత గొప్ప సినిమాని ఇచ్చిన బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేనికి కృతజ్ఞతలు. ఈ సినిమా ఎనిమిది రోజుల్లోనే బాలకృష్ణ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇంకా లాంగ్ రన్ ఉంది' అని తెలిపారు. 'బాలకృష్ణతో 'అఖండ' తర్వాత, గోపి ఈ కథ చెప్పినప్పుడు నెక్స్ట్ లెవల్‌కి ఎలా తీసుకెళ్ళాలని అనుకున్నాను. గోపి మాములుగా తీయలేదు. బాలయ్యని చూస్తేనే ఒక పూనకం వచ్చేస్తుంది. ఆయన సినిమాకి పని చేయడం ఒక గిఫ్ట్. సంక్రాంతికి రెండు విజయాలు అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌కి అభినందనలు' అని తమన్ అన్నారు.