Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా ఈనెల 26న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా సోమవారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ, 'కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్ళిన తర్వాత విడుదల అవుతున్న నా తొలి సినిమా 'హంట్'. నా ప్రతి సినిమా మార్నింగ్ షో తర్వాత ఆయన నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చేది. ఇప్పుడు నేను అది మిస్ అవుతా. ఇన్నేళ్ళ నా సక్సెస్ఫుల్ ప్రయాణం మావయ్యకి అంకితం. ఈ సినిమాలో కొత్త పాయింట్ ఉంది. నిజాయితీగా చెప్పాలంటే ఏ హీరో అటెంప్ట్ కూడా చేయడు. వందల మంది సినిమా చూశారు. అందరికీ నచ్చింది. అర్జున్ ఎ, అర్జున్ బి... సినిమాలో నా క్యారెక్టర్ రెండు షేడ్స్‌లో ఉంటుంది. స్టంట్స్ విషయంలో నేను రిస్క్ చేశానని అందరూ అంటున్నారు. నా కంటే ముందు ఆనంద ప్రసాద్ రిస్క్ చేశారు. శ్రీకాంత్ అన్నయ్య మంచి వ్యక్తి. భరత్ ఫెంటాస్టిక్ యాక్టర్. దర్శకుడు మహేష్ సెట్లో మంచి వాతావరణం క్రియేట్ చేశాడు. ఇంతకు ముందు తెలుగులో ఎవరూ చేయని సినిమా 'హంట్'. సినిమా చూశాక స్పాయిలర్స్ ఇవ్వొద్దు. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తే విన్నింగ్ ఛాన్సులు ఎక్కువని నా ఫీలింగ్' అని తెలిపారు.
'ఈ నెల 26న మా సంస్థలో నిర్మించిన 'హంట్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. ఇంగ్లీష్ టైటిల్‌తో వస్తున్న తెలుగు చిత్రమిది' అని నిర్మాత వి. ఆనంద ప్రసాద్ చెప్పారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, 'నేను 'హంట్' చేయడానికి కారణం భవ్య క్రియేషన్స్, సుధీర్ బాబు. దర్శకుడు మహేష్ క్లారిటీతో తీశాడు. సినిమాలో నాది పాజిటివ్ క్యారెక్టరా? నెగిటివ్ క్యారెక్టరా? అనేది సస్పెన్స్. నేను 'హంట్' చూశా. పెద్ద హిట్ అవుతుంది' అని తెలిపారు.
'సినిమా చూసిన తర్వాత నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ 'హంట్'తో తెలుగులోకి మళ్ళీ రావాలని తీసుకున్న నిర్ణయం సరైనదని అనిపించింది. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి థ్రిల్లర్ ఇది' అని 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ చెప్పారు.
టీజర్, ట్రైలర్ చూసి ప్రేక్షకులు అప్రిషియేట్ చేస్తున్నారు. అందులో ఎక్కువ షేర్ మా హీరో సుధీర్ బాబుకు వెళుతుంది. ఇప్పటి వరకు చూసిన సుధీర్ బాబు కంటే బెస్ట్ సుధీర్ బాబును ఈ సినిమాలో చూస్తారు. శ్రీకాంత్‌తో పని చేయడం ఒక గౌరవం. భరత్ బాగా నటించారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం సూపర్. ప్రేక్షకుల మీద మా 'హంట్' స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సులు మాత్రమే కాదు... స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ ఉంది. సుధీర్ బాబు ఫ్యాన్స్ అందరికీ ఇదొక ట్రీట్. 'విక్రమ్' సినిమాకు, మా 'హంట్'కు సంబంధం లేదు. ట్రైలర్ చూసి కథ ఊహించినా, థియేటర్లకు వచ్చిన మీకు కిక్ ఇస్తుంది.
సినిమా బ్లాక్ బస్టర్.
- దర్శకుడు మహేష్