Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుహాస్ నటించిన నూతన చిత్రం 'రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక.
ఛారు బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి.మనో హర్ సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతూ, 'మాది విజయవాడ. అక్కడే బిటెక్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చాక సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇక్కడ కొందరి దగ్గర రాశాను. బాగా రాస్తున్నానని వారు చెప్పే మాట నాకు ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చేది. సుహాస్తో షార్ట్ ఫిల్మ్ నుండి పరిచయం. నా మొదటి సినిమా సుహాస్తో రావడం అదష్టం. ఇది ఫ్యామిలీ మూవీ అని మొదటి నుండి చెబుతున్నాం. ఇది మన ఇంట్లో జరిగే కథ. ప్రతి పాత్రలో అల్లరి ఉంటుంది. రైటర్ పద్మభూషణ్ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో హీరో పాత్ర పేరు పద్మభూషణ్. తను ఒక రైటర్ కావాలని అనుకుంటాడు. మరి రచయిత అయ్యాడా లేదా తన ప్రయాణం ఎలా సాగింది .. అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఇందులో ఆశిష్ విద్యార్ధి, రోహిణి, గోపరాజు రమణ ఇలా చాలా మంచి నటులు నటించారు. హీరోయిన్ శిల్పా రాజ్ ఓటీటీ స్టార్. అలాగే గౌరీ ప్రియ చాలా అద్భుతంగా చేశారు. నిర్మాతలు నిర్మాణ పరంగా ఎంతో అద్భుతంగా సహకరించారు. దీంతో మంచి అవుట్ ఫుట్ వచ్చింది' అని తెలిపారు.