Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'హంట్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై నిర్మాత వి.ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈనెల 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు మీడియాతో ముచ్చటించారు.
'ఈ సినిమాలో నేను ఎవరిని 'హంట్' చేస్తున్నాననే సస్పెన్స్ అంతా ఉంటుంది. ప్రతి పాత్రను అనుమానిస్తూ ఉంటాను. ప్రేక్షకులు కూడా నా పాత్రతో పాటు ప్రయాణిస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. కబీర్ సింగ్ దుహాన్, మైమ్ గోపి... ఇలా చాలా మంది ఉన్నారు. వెరీ ఎంగేజింగ్ థ్రిల్లర్ ఇది. ఇందులో శ్రీకాంత్, భరత్ ఛాయిస్ దర్శకుడు మహేష్‌దే. యాక్టర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా పోలీస్ క్యారెక్టర్ చేయాలనుకుంటారు. అర్జున్ ఎ, బి... నా పాత్రలో రెండు వేరియేషన్స్ చూస్తారు. అలాగే యాక్షన్ సీక్వెన్సులు ఉన్నా ఎంత వరకు ఉండాలో, అంతే ఉంటాయి. సినిమా కోర్ పాయింట్ ఎమోషనే. అయితే : సినిమాలో ప్రేమకథ లేదు. ఫ్రెండ్షిప్ మీద ఎక్కువ ఎమోషన్ ఉంటుంది. గతం మర్చిపోవడానికి ముందు... అర్జున్ ఎ క్యారెక్టర్ ఎలా ఉండాలో క్లియర్‌గా ఉంది. గతం మర్చిపోయిన తర్వాత... అర్జున్ బి క్యారెక్టర్ కొంచెం కష్టం అయ్యింది. మెమరీ లాస్ మీద వచ్చిన 'గజినీ' లాంటి క్యారెక్టర్లకు పోలిక ఉండకూడదని ట్రై చేశాం. అందుకే ఇది ప్రతి హీరో అటెంప్ట్ చేసే స్టోరీ కాదు. నేను ఈ విధంగా చేయడం వాళ్ళు (ఫ్యాన్స్) యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనేది చూడాలని ఉంది. మనం సినిమా ఎంత బాగా చేసినా... రిజల్ట్ మీద చాలా ప్రభావాలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా మొత్తం రిస్క్ చేశాం. ఇందులో హీరోయిన్ లేదు. మేం అక్కడే రూల్ బ్రేక్ చేశాం. రెండు నిమిషాల్లో కథలోకి వెళ్ళిపోతారు. లాంగ్ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. పేపర్ మీద కథ ఉన్నప్పుడు రిస్క్. అయితే, నేను సినిమా చూశా. వందల మంది చూశారు.
మా ఫ్యామిలీ చూశారు. అందరికీ నచ్చింది. ఇప్పుడు ప్రేక్షకులు కొత్త కాన్సెప్ట్, కథలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. సినిమా విజయం మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమాకు కృష్ణగారి రియాక్షన్ తెలుసుకోవాలని అనుకున్నాను. ప్రతిసారీ నా సినిమా విడుదలైనప్పుడు ఆయన ఫోన్ చేయడం లేదంటే ఇంటికి పిలిచి మాట్లాడటం చేసేవారు. ఈ సినిమాకి కూడా ఆయన అప్రిషియేట్ చేస్తారని అనుకున్నాను. ఇప్పుడు ఆయన మన మధ్యలో లేకపోవడంతో వెలితిగా ఉంది' అని అన్నారు.