Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడు విభాగాల్లో పోటీ పడుతున్న భారతీయ సినిమాలు
మొత్తం విభాగాల్లో ఆస్కార్ రేసులో అమీతుమీ తేల్చుకునేందుకు పోటీ పడిన భారతీయ సినిమా మూడు విభాగాల్లో స్థానాన్ని సొంతం చేసుకుంది. వీటిల్లో తెలుగు సినిమా 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో స్థానం దక్కించుకోవడం విశేషమైతే, 'లాగాన్' తర్వాత మరో భారతీయ చిత్రం ఆస్కార్‌కి నామినేట్ కావడం మరో విశేషం. అలాగే ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 'ఆల్ దట్ బ్రెత్స్', డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో 'ది ఎలిఫెంట్ విష్పర్స్' నామినేషన్లు సొంతం చేసుకున్నాయి. యావత్ భారతీయ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 95వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) ఫైనల్ నామినేషన్ల జాబితాను మంగళవారం ఆస్కార్ కమిటీ ప్రకటించింది. వివిధ భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్ లిస్ట్ కాగా, వీటిల్లో అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ సభ్యులు తుది జాబితాకు ఎంపిక చేశారు.
ఉత్తమ చిత్రం
అవతార్ : ది వే ఆఫ్ వాటర్, టాప్‌గన్ : మావెరిక్, ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్, ఎల్విస్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, ది ఫేబుల్ మ్యాన్స్, టార్, ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్ వంటి చిత్రాలు పోటీ పడుతున్నాయి.
ఉత్తమ దర్శకుడు
మార్టిన్ మెక్‌డొనాగ్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్), డానియెల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), స్టీవెన్ స్పీల్బర్గ్ (ది ఫేబుల్‌మ్యాన్స్), టడ్ ఫీల్డ్ (టార్), రూబెన్ ఆస్టాండ్ (ట్రైయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్).
ఉత్తమ నటుడు
ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్), కొలిన్ ఫార్రెల్ (ది బన్షీష్ ఆఫ్ ఇనిషెరిన్), బ్రెండన్ ఫాస్రెల్ (ది వేల్), పాల్ మెస్కల్ (ఆప్టర్సన్), బిల్ నిగీ (లివింగ్).
ఉత్తమ నటి
కేట్ బ్లాంచెట్ (టార్), అన్నా దె ఆర్మాస్ (బ్లాండ్), ఆండ్రియా రైజ్‌బరో (టు లెస్లీ), మిషెల్ విలియమ్స్ (ది ఫేబుల్‌మ్యాన్స్), మిషెల్ యా (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్).
ఒరిజినల్ సాంగ్
నాటు నాటు (ఆర్ఆర్ఆర్), అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్), హోల్డ్ మై హ్యాండ్ (టాప్‌గన్ : మార్వెరిక్), లిప్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్).
ఉత్తమ సహాయ నటుడు
బ్రెన్డాన్ గ్లెసన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్), బ్రెయిన్ టైరీ హెన్రీ (కాజ్వే), జడ్ హిర్చ్ (ది ఫేబుల్ మ్యాన్స్), బేరీ కియోఘాన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిస్), కి హురు క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్).
ఉత్తమ సహాయనటి
ఆంజెలా బాస్సెట్ (బ్లాక్ పాంథర్ : వకండ ఫరెవర్), హాంగ్ చ్యూ (ది వేల్), కెర్రీ కాండన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్), జామీలీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), స్టెఫానీ (ఎవ్రీ థింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్).
అత్యధికంగా 11 నామినేషన్లు దక్కించుకున్న
ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్
95వ అకాడమీ అవార్డుల్లో ఈ ఏడాది అత్యధికంగా 11 నామినేషన్లను దక్కించుకుని 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' చిత్రం ప్రధమ స్థానంలో నిలిచింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ నటి, ఉత్తమ ఎడిటర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి (ఇద్దరు), బెస్ట్ కాస్టూమ్స్ విభాగాల్లో ఈ సినిమా తుది జాబితాలో చోటు సొంతం చేసుకుని సత్తా చాటింది. దీని తర్వాత ది బన్షీస్ ఆఫ ఇనిషెరిన్, ది ఫేబుల్ మ్యాన్స్, టాప్ గన్, టార్, బ్లాక్‌పాంథర్ తదితర చిత్రాలు సైతం చెప్పకోదగ్గ నామినేషన్లతో బరిలో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. మార్చి 12 (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13)న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరిగే వేడుకలో విజేతలకు ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాలను అందజేయనున్నారు.