Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సునీల్, చైతన్య రావు మదాడి ప్రధాన పాత్రలలో స్వాన్ మూవీస్ సమర్పణలో ఫన్ సాగ బ్యానర్ పై రూపొందిన చిత్రం 'వాలెంటైన్స్ నైట్'. అనిల్ గోపిరెడ్డి దర్శకత్వంలో యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి తప్తి పాటిల్, సుధీర్ యాళంగి మహీంధర్ నారల నిర్మాతలు. ఈ చిత్రం నేడు (గురువారం) విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చైతన్య రావు మాట్లాడుతూ, 'నిర్మాతలు ఈ కథని బలంగా నమ్మి, ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. దర్శకుడు అనిల్ సినిమాని చాలా కొత్తగా తెరకెక్కించారు. ఇందులో చాలా జోనర్స్ ఉన్నాయి. ఒకే సినిమాలో దాదాపు పది కథలు చూడొచ్చు. ఒక కథకి మరో కథకి ఎక్స్లెంట్ ఇంటర్ లింక్ ఉంటుంది. ఫ్యామిలీతో కలసి చూడాల్సిన సినిమా ఇది' అని తెలిపారు. '6 జంటల కథ ఇది. ఒకరి కథలోకి ఒకరు ప్రవేశించిన తర్వాత 'వాలెంటైన్స్ నైట్' నాడు ఏం జరిగిందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించాం. ఇందులో ప్రేమ, రొమాన్స్, టీనేజ్ లైఫ్.. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది' అని దర్శకుడు అనిల్ గోపిరెడ్డి అన్నారు.