Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సిందూరం'. రిపబ్లిక్ డే సందర్భంగా నేడు (గురువారం) ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి మాట్లాడుతూ, 'ఈ సినిమా అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. నక్సల్స్ పాయింట్‌తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నివేశాలను ఈ సినిమాలో చూపించాం. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. మొత్తంగా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా ప్రేక్షకుల ముందుకు రానుంది' అని తెలిపారు.
'ఈ సినిమాలో నటించిన అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. మంచి సినిమా తీశామనే సంతప్తి ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తోన్న ఈ సినిమా అందరికి నచ్చే సినిమా అవుతుంది' అని నిర్మాత ప్రవీణ్ రెడ్డి జంగా చెప్పారు. శివ బాలాజీ మాట్లాడుతూ,'డైరెక్టర్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఇదొక ఇంటెన్స్ జోనర్. కొన్ని సన్నివేశాలు చేస్తున్నప్పుడు కాంట్రవర్సీ అవుతుందేమో అనిపించింది. డైరెక్టర్ బాగా రీసెర్చ్ చేసి ఈ కథ రాసుకున్నారు. నేను మొదటిసారిగా నక్సలైట్‌గా కనిపించబోతున్న ఈ సినిమా కొత్త కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది' అని అన్నారు.